
Trade Talks: భారతపై అమెరికా విధించిన కొత్త టారిఫ్ లు త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుంకాల విధింపుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నెల 25న భారత్ లో జరగాల్సిన ఆరో విడుదల వాణిజ్య చర్చలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. తదుపరి చర్చలు ఎప్పుడనేది త్వరలో నిర్ణయించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆగష్టు 27 నుంచి భారత్ పై 50 శాతం టారిఫ్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పన్ను పోటు తప్పదని ట్రేడ్ వర్గాలు అభిప్రయాపడుతున్నాయి.
పుతిన్ తో భేటీ తర్వాత కూడా..
సుంకాల విధింపులో అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్-పుతిన్ భేటీ తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా తన నిర్ణయాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన 25 శాతం సుంకం తొలగింపు కోసం తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. టారిఫ్‌లు సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య ఈ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. పుతిన్ తో భేటీ తర్వాతే ట్రంప్.. రెండో దశ ఆంక్షలు వాయిదా వేసే అంశాన్ని పరిశీలిస్తానని వెల్లడించారు. అయితే, 25 శాతం పెనాల్టీ సుంకంపై మాత్రం అమెరికా ఆలోచన మారలేదని తెలుస్తోంది.