
-
భారత్‌పై సుంకాల మోత మోగించిన అమెరికా
-
భారత్‌పై 25శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ నిర్ణయం
-
ఆగస్టు 1 నుంచే పెంచిన టారిఫ్ అమలు
-
రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొన్నదన్న ట్రంప్
-
ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అన్ని దేశాలు కోరాయి
-
రష్యా నుంచి భారత్, చైనా చమురు దిగుమతి చేసుకుంటున్నాయి
-
భారత్ మిత్ర దేశమే… కానీ సుంకాలు ఎక్కువే: ట్రంప్
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ: భారత్‌పై అమెరికా టారిఫ్ బాంబ్ వేసింది. ఒక్కసారిగా సుంకాల మోత మోగిస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. ఇండియాపై ఏకంగా 25శాతం సుంకాలు విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచే అమలులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
భారత్ మిత్రదేశమంటూనే… సుంకాలు ఎక్కువగా విధించారు అమెరికా అధ్యక్షుడు. రష్యా నుంచి భారత్ ఆయుధాలు కొనుగోలు చేస్తోందని అన్నారు ట్రంప్. రష్యా నుంచి భారత్, చైనా చమురు దిగుమతి చేసుకుంటున్నాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అన్ని దేశాలు సూచించాయని వెల్లడించారు ట్రంప్.
Read Also: