Homeఅంతర్జాతీయంభూత‌ల దాడుల‌కు పాల్ప‌డితే అమెరికా సైనికులు సోర‌చేప‌ల‌కు ఆహారం అవుత‌రు...ఇరాన్ స్ర్టాంగ్ వార్నింగ్‌...!

భూత‌ల దాడుల‌కు పాల్ప‌డితే అమెరికా సైనికులు సోర‌చేప‌ల‌కు ఆహారం అవుత‌రు…ఇరాన్ స్ర్టాంగ్ వార్నింగ్‌…!

ఢిల్లీ,క్రైమ్ మిర్ర‌ర్ః ఒక ప‌క్క శాంతి చ‌ర్చ‌లు అంటూ మ‌రొప‌క్క యుద్దం రోజు రోజుకు తీవ్ర‌మ‌వుతుంది. దీంతో ప‌శ్చిమాసియా బాంబుల దాడుల‌తో ద‌ద్ద‌రిల్లి పోతుంది. కాగా అమెరికా అధ్య‌క్షుడు శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయంటూనే ట్రంప్ భూత‌ల దాడుల‌కు సిద్ద‌మ‌య్యారు.భారీగా సైనిక శ‌క్తిని మోహ‌రిస్తుంది. దీంతో అమెరికా నిర్ణ‌యాన్నిఇరాన్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ తాజాగా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అమెరికా భూత‌ల దాడుల‌కు పాల్ప‌డితే అమెరికా, ఇజ్రాయెల్ లో ని రాజ‌కీయ నాయ‌కులు, అధికారుల ఇళ్ల‌ను టార్గెట్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఇరాన్‌లోని ఖాత‌మ్ ఆల్ అన్బియా సెంట్ర‌ల్ హెడ్ క్వార్ట‌ర్ అధికార ప్ర‌తినిధి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భూత‌ల దాడులకు పాల్ప‌డితే మునుపెన్న‌డు చూడ‌ని విద్వంసాన్ని చూస్తార‌ని హెచ్చ‌రించారు. ట్రంప్ ఇరాన్ భూభాగంపై దాడి చేసి ఆక్రమించాల‌ని చూస్తున్నార‌ని పేర్కొన్నారు.

యుద్ద భూమి నుంచి వేల కిలోమీట‌ర్ల‌దూరంలో ఉన్న అమెరికా సైన్యం ఇరాన్ యోధుల ప్ర‌తిఘ‌ట‌న‌ను ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని, అమెరికా చివ‌రికి అవ‌మానం, వినాశ‌నం, ప‌త‌నం అంచుల‌కు వ‌ర‌కు తీసుకెళ్తాయ‌ని తెలిప‌పారు. అమెరికా సైనికులు ప‌ర్శియ‌న్ సొర‌చేప‌ల‌కు ఆహారం అవుతార‌ని తీవ్ర‌మైన హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఏదేమైన ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియా భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments