
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో యూరియా ఎరువు కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాంధారి సహకార సొసైటీ వద్ద పెద్ద సంఖ్యలో రైతులు భేటీ అవుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళన వల్ల రోడ్డు మార్గం పూర్తిగా దిగ్బంధం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
రైతులు మాట్లాడుతూ, ఒక ఎకరానికి కనీసం నాలుగు బస్తాల యూరియా అవసరం ఉంటుందని, కానీ సొసైటీలు కేవలం రెండు బస్తాలే ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సొసైటీల వద్ద స్టాక్ లేదని చెబుతున్నా, ప్రైవేట్ డీలర్ల వద్ద మాత్రం యూరియా పుష్కలంగా ఉండటం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. దీంతో సొసైటీల నుంచే యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళ్లుతున్నదన్న అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు సొసైటీ చైర్మన్ సాయి కుమార్‌ను నిలదీశారు. ఆయన రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. తమకు తగినంత యూరియా అందకపోతే మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని రైతులు హెచ్చరించారు. యూరియా కొరతను తొలగించి, సొసైటీలకు తగినంత స్టాక్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
మస్క్ దుకాణం సర్దేయాల్సిందే.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్!