
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన గుండె సమస్యతో బాధపడుంతున్న ఆంజనేయులు గౌడ్ కుమారుడు 11 నెలల అబ్బాయి గుండె ఆపరేషన్ కి తెలంగాణ రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.25వేలు ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం హైదరాబాదులోని తన కార్యాలయంలో చిన్నారి తండ్రి ఆంజనేయులుకు చెక్కును అందజేశారు. మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ బీఆరెస్ పార్టీ తలకొండపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, శ్రీను, నరేష్ గౌడ్, వెంకటయ్య, శ్రీను, లక్ష్మయ్య, మహేష్, యాదయ్య తదితరులు ఉన్నారు.
Read also : ఆమనగల్లు లో ప్రభుత్వ భూమి అక్రమ కబ్జాలపై రెవెన్యూ దాడి
Read also : VIRAL: అమ్మాయి దుస్తులు చించేసి.. దారుణం! (VIDEO)





