ట్రావెల్

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయండి.. లేదంటే నష్టమే?

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- దేశ వ్యాప్తంగా పాఠశాలలో విద్యార్థులు ఆధార్ వేలిముద్రలను అప్డేట్ చేయాలని ఉడాయ్ చీప్ భువనేశ్ కుమార్ కోరారు. పాఠశాలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలనీ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలు లేక రాశారు. 5-15 ఏళ్ల వయసులో గల పిల్లలకు బయోమెట్రిక్ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆధార్ అప్డేట్ చేయకపోతే ఎంట్రన్స్ పరీక్షలు రాసే అవకాశం ఉండదని,ప్రభుత్వ పథకాలు అందుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లలు ఆధార్ కార్డు అప్డేట్ కు సంబంధించిన యూనిట్ ఐడిఎమ్టిపికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ) ప్రకటన విడుదల చేసింది. 5-15 సంవత్సరాల వయసు గల పిల్లల ఆదార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని దేశవ్యాప్తంగా పాఠశాలలకు పిలుపునిచ్చింది. పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా పెండింగ్లో ఉన్న బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేయాలని కోరుతూ యుఐడిఏఐ సీఈవో భువనేష్ కుమార్ రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శిగా లేఖ రాశారు.

Read also : బిగ్ బాస్ లోబోకు సంవత్సరం జైలు శిక్ష!.. ఎందుకంటే?

యూనిఫైడ్ డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లేస్ ( యు డి ఎఫ్ ఈ) అప్లికేషన్లో పాఠశాల పిల్లల ఆధార్ కు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) స్టేటస్ ను అందించడానికి పాఠశాల అవకాశం ఉంది. యుఐడిఏఐ ఈఓ అన్ని రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శి కూడా ఈ పరిస్థితి గురించి తన లేఖలో వివరించారు. ఎం బి యు శిబిరాలను నిర్వహించడానికి ఆయా ప్రాంతాల మద్దతు కోరారు. ఈ శిబిరాలు పెండింగ్లో ఉన్న ఎంబియూలను పూర్తి చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. అయితే ఈ శిబిరాలను పాఠశాలల్లో ఎప్పటిలోపూ ఏర్పాటు చేయాలనే దానిపై సమాచారం తెలియాల్సి ఉంది.

Read also : 15 కి. మీ మేరా ట్రాఫిక్ జామ్.. NH-44 పై నిలిచిపోయిన భారీ వాహనాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button