
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య మూడవ వన్డే మ్యాచ్ లో ఇండియన్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మైదానంలో గాయపడిన వెంటనే అతన్ని వైద్య బృందం ఆస్పత్రికి తరలించగా అక్కడ ఐసీయూలో పెట్టి మరి శ్రేయస్ అయ్యర్ కు చికిత్సను అందజేశారు. ప్రస్తుతం పూర్తిగా కోరుకున్న అయ్యర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు బీసీసీఐ తాజాగా వెల్లడించింది. శ్రేయస్ అయ్యర్ చాలా త్వరగా రికవరీ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది అని.. ప్రస్తుతం అయ్యర్ ఆరోగ్యం పూర్తిగా నయం కానప్పటికీ నిలకడగా ఉన్నట్లు బీసిసిఐ పేర్కొంది. మరింత పూర్తిగా కోలుకునేందుకు మరికొద్ది రోజులపాటు శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోనే ఉంటారు అని వెల్లడించారు. కాగా మూడవ వన్డేలో అద్భుతమైన క్యాచ్ పట్టిన సందర్భంలో శ్రేయస్ ప్లీహంకు గాయం అయింది. ఈ గాయానికి సిడ్నీ వైద్యులు సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. నిన్న ఐసీయూలో నుంచి బయటకు వచ్చిన అయ్యర్ మరో వారం రోజులపాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని డాక్టర్లు ప్రకటించారు. ఒకవేళ వారంలోపే పూర్తిగా కోలుకుంటే శ్రేయస్ అయ్యర్ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉండడంతో ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా మైదానంలో అడుగు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read also : బిగ్ బ్రేకింగ్ న్యూస్… శ్రీకాకుళంలో భారీ తొక్కిసలాట..9 మందికి చేరిన మృతుల సంఖ్య
Read also : బీసీ హాస్టల్ లో కలుషిత ఆహారం.. 56 మంది విద్యార్థులకు సీరియస్





