క్రీడలు

గిల్ గాయం పై అప్డేట్..!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మొదటి టెస్టులో భాగంగా కెప్టెన్ గిల్ మెడ నొప్పి గాయం కారణంగా వెనుదిరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తరువాత గాయం పెద్దదైనట్లు తెలిసి ఫిజియోలు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్సను కూడా అందించారు. అయితే తాజాగా కెప్టెన్ గిల్ గాయం పై ఒక అప్డేట్ అయితే వచ్చింది. సౌత్ ఆఫ్రికా తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందుగానే టీం తో పాటు కెప్టెన్ గిల్ కూడా గువాహటి వెళ్లినట్లు సమాచారం. అయితే ప్లేయర్స్ ప్రాక్టీస్ లో భాగంగా మాత్రం నిన్న గిల్ హాజరు కాలేదు అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి . ఇక రెండో టెస్టులో ఇండియన్ కెప్టెన్ గిల్ ఆడే ఛాన్సులు కష్టమే అని పక్కా సమాచారం. ప్రస్తుతం గిల్ పూర్తిగా కోలుకుంటున్నారని.. ఇవాళ సాయంత్రం ఫిజియోలు మరియు డాక్టర్లు తుది నిర్ణయం తీసుకొని బ్యాటింగ్ చేయగలరా లేదా అనే విషయాలను చెబుతారు అని బ్యాటింగ్ కోచ్ కోటక్ తెలిపారు. దీంతో రెండో టెస్టులో కూడా గిల్ ఆడే అవకాశాలు తక్కువే అని.. ఇవాళ సాయంత్రానికి మరోసారి గిల్ ఆడుతారా లేదా అనేది అప్డేట్ వస్తుంది అని తెలుస్తుంది. నేడు గిల్ కు ఫిట్నెస్ టెస్ట్ చేయడం ద్వారా రెండవ టెస్టులోకి ఎంట్రీ ఇస్తారా లేక మరికొద్ది రోజులపాటు రెస్ట్ తీసుకుంటారా అనేది ఇవాళ సాయంత్రం తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మెడ నొప్పి గాయం కారణంగా మెల్లిగా కోలుకుంటున్న గిల్ ను తమ అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా గాయం నుంచి ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా కోలుకుంటున్నారు. వీరిద్దరిని త్వరగా మైదానంలో చూడాలి అని అభిమానులు కోరుతున్నారు.

Read also : Droupadi Murmu: రేపు పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Read also : సాగర్ TO శ్రీశైలం.. రేపటి నుంచే ప్రారంభం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button