Viral Video: కొంత మంది వ్యక్తులు చేసే పని జనాలను భయాందోళనకు గురి చేస్తుంది. తాజాగా ఓ యువకుడు ఇలాగే చేశాడు. బట్టల షాపులోకి చొరబడి, ఓ యువతి గొంతు మీద కత్తి పెట్టి బెదిరింపులకు దిగాడు. లక్ష రూపాయలు ఇస్తేనే యువతిని వదిలేస్తానంటూ హల్ చల్ చేశాడు. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ సైకోను అడ్డుకున్నారు. అమ్మాయిని సేవ్ చేశారు. ఈ ఘటన ఉత్తర పదేశ్ లో జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
తాజాగా బిజ్‌నోర్ లోని నజీబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ బట్టల షాపులో ఓ యువతి షాపింగ్ చేస్తూ ఉంది. రాత్రి 7.30 గంటల సమయంలో అజిత్ అనే వ్యక్తి షాపులోకి చొరబడ్డాడు. కత్తితో బెదిరించి ఓ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె గొంతు మీద కత్తి పెట్టి లక్ష రూపాయలు ఇస్తేనే వదులుతానంటూ బెదిరింపులకు దిగాడు. భయంతో ఆ యువతి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. అతడికి సర్ధిచెప్పి యువతిని కాపాడే ప్రయత్నం చేశారు. అతడు ఏమాత్రం వారి మాట వినలేదు. దాదాపు అరగంట పాటు అక్కడి జనం ఎంతో ప్రయత్నించారు.
సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించిన జనం
8 గంటల ప్రాంతంలో ఎలాగైతేనేం అందరూ కలిసి అతడ్ని పట్టుకున్నారు. తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ సైకోను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.
उत्तर प्रदेश में कानून-व्यवस्था का पहला दिन।
बिजनौर जिले में एक व्यक्ति ने एक दुकान के अंदर एक नाबालिग लड़की को चाकू की नोक पर बंधक बना लिया और कथित तौर पर मनमानी मांग की बाद में पुलिस ने लड़की को छुड़ा लिया और आरोपी अजीत बाल गोविंद को गिरफ्तार कर लिया। pic.twitter.com/0IsGiE6YEk
— Anuj Agnihotri Swatntra (@ASwatntra) January 1, 2026





