
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహదేవ్ మండలం సూరారం గ్రామంలో డాక్టర్ బీర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఘనంగా జరిగింది, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విగ్రహావిష్కరణ చేసి మహానీయుడి విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులతో పూలదండలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ సభలో మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో యుద్ధాలతో సాధించలేనిది, కేవలం జ్ఞానంతో రాజ్యాంగాన్ని సాధించిన మొదటి వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అణచివేత, చిన్నచూపునకు గురైనా అంబేద్కర్ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి భారతదేశానికి వచ్చి రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల మన్ననలు పొందారన్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని, నిరంతరం జ్ఞానం కోసం శ్రమిస్తూ తాము తక్కువ కాదనే దృక్పదంలో ఉండాలన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఈ దేశంలో ప్రతి వారికి కావాల్సిన వ్యక్తి అంబేద్కర్ అని, ఒక వర్గం, కులానికి కాదని, అందరి కోసం రాజ్యాంగాన్ని రచించిన మహా మేధావని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం అనుసరించాల్సిన మార్గమన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, విద్యా, ఉద్యోగం, రాజకీయాల్లో పేదలకు ప్రాతినిధ్యం కోసం ఆయన చేసిన సేవలు రాజ్యాంగం ద్వారా పేదలకు కల్పించిన హక్కుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, దళిత సంఘం నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.