తెలంగాణ

హైదరాబాద్ లో తప్పని సిఎన్జి కష్టాలు.. క్రైమ్ మిర్రర్ నిఘాకి చిక్కిన బంకు యజమానుల చేతివాటం

-సిఎన్జి కావాలా నాయనా..! 10 రూపాయలు ఎక్స్ట్రా..!!

-హైదరాబాద్ లొ తప్పని సిఎన్జి కష్టాలు

-“క్రైమ్ మిర్రర్” నిఘాకి చిక్కిన బంకు యజమానుల చేతివాటం

*నిద్రావస్థలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు

హత్నూర, క్రైమ్ మిర్రర్ :- హైదరాబాద్ లో  సిఎన్జి  వినియోగదారుల  కష్టాలు  అన్ని ఇన్ని కాదు. భారీ క్యూ లైన్, గంటల కొద్ది నిరీక్షణ దానికి తోడు కొంత మంది బంకుల్లో సిఎన్జి నింపడానికి వినియోగదారుల దగ్గర వాహనానికి  ₹10 అదనంగా వసూళ్లు చేస్తున్నారు. సిఎన్జి సరఫరా చేసె కంపెనీలకు పిర్యాదు చేసిన ఉపయోగం లేదు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భాగ్యనగర్ గ్యాస్, మేఘ గ్యాస్ మరియు టొరెంట్ గ్యాస్ తదితర గ్యాస్ కంపెనీలు ఉన్నాయి. అదనపు ₹10 ఇవ్వక పోతే సిబ్బంది వాహనదారులతో గొడవకు దిగుతున్నారు. నువ్వు కొత్తగా మొదటి సారి వచ్చావా మా బంకుకి అంటూ అందరు ఇస్తారు నువ్వెందుకు ఇవ్వవు అని దబాయిస్తున్నారు . సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులు కొంత మంది ఐతే అదనపు సొమ్ము డిమాండ్ చేస్తున్నారు. చెల్లించక పోతే మరొకసారి గ్యాస్ ఫిల్ చెయ్యమని హెచ్చరిస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో అయితే ఎక్స్ట్రా ₹10  ఇవ్వని వినియోగదారుల బండి నెంబర్ నోటీస్ బోర్డులో అతికిస్తున్నారు. మరోసారి వచ్చినప్పుడు నో స్టాక్ అని బుకాయిస్తున్నారు.

Read also : బీటలు వారిన సీసీ రోడ్లు… అసంపూర్తిగా నిర్మాణ పనులు

ఓల, ఉబర్, రాపిడో డ్రైవర్లను అయితే ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారు. ప్రతి రోజు క్యాబ్ డ్రైవర్లు కనీసం రెండు సార్లు అయిన గ్యాసు నింపుతారు. నింపిన ప్రతి సారి 10 రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాల్సిందే. అసలు ఎందుకు ఎక్స్ట్రా చెల్లించాలి అని అడిగిన డ్రైవర్లను మీరు సంపాదిస్తలేర 10 రూపాయలు అదనంగా ఇవ్వాల్సిందే అని జబ్బర్దస్తీగ వసూళ్లు చేస్తున్నారు. రెక్కాడితే గాని దొక్కడని క్యాబ్ డ్రైవర్లు మరోసారి గ్యాస్ నింపరేమోనని భయపడి అదనపు 10 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఒక బంకులో రోజుకు 1000 వాహనాలు గ్యాసు నింపాయనుకోండి ఒక్కొక్క వినియోగదారుల నుండి పది రూపాయలు వసూళ్లు చేస్తే రోజుకు బంకు వారు అక్రమంగా ₹10000 వసూల్ చేస్తున్నారు. అంటె ఒక రోజుకు పదివేల రూపాయలు జనాల సొమ్మును అప్పనంగా లూఠీ చేస్తున్నారు. ఎన్ని సార్లు బంకు సిబ్బంది పై తరితర గ్యాస్ కంపెనీలకు పిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రపు నో టిప్స్ నో ఎక్స్ట్రా మనీ అంటు బోర్డులు పెట్టి చేతులు దులుపు కొంటున్నారు. కొన్ని బంకుల్లో బోర్డులు కూడా పెట్టడం లేదు. ఇట్టి విషయంలో ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమి ఎరగనట్టు వ్యవహరిస్తున్నారు. ఇంత అవినీతి జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. ఇందులో నుండి అధికారులకు కూడా వాటా వెళుతుందేమోనని వినియోగదారులు గుసగుసలు ఆడుతున్నారు.

Read also : బీసీ రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటుంది : భట్టి విక్రమార్క

ప్రతి రోజు పహడి షరీఫ్ భారత్ పెట్రోల్ బంక్ ఎయిర్పోర్ట్ భయట హెచ్ పి పెట్రోల్ బంకు లొ అర కిలోమీటర్ దూరం వాహనాలు భారీ క్యూ లైన్ కనబడింది. క్రైమ్ మిర్రర్ ఏమిటా అని ఆరా తీస్తే గంటన్నర నుంచి లైన్ లొ వేచి ఉన్నామని వాహనాల క్యూ లైను అర అంగులము కూడా కదలడం లేదని వినియోగదారులు విసుకున్నారు. ఒకపక్కా రాత్రి సమయం బారులు దీరిన కార్లు,ఆటోలు సి ఎన్ జి వినియోగించే ఇతర వాహనాలు నిలిచిపోయాయి. దాంతో వియోగదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు గ్యాసు కొరకు వేచి ఉండలేక అనేక అవస్థలు పడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడినప్పుడు గ్యాసు కొరకు రాత్రి పూట బంకు ల్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని, దాని వలన సమయం వృధా అవుతుందని వినియోగదారులు ఆవేదన చెందారు. ఆ బంకు లే కాకుండా బాలానగర్, మూస పేట, ముషీరాబాద్, ఎయిర్పోర్ట్, శేరిలింగంపల్లి, బంకుల్లో ఇదే తతంగం నడుస్తుంది ఇవి ఉదాహరణకు మాత్రమే ఇలా చాల బ్యాంకుల్లో అదనంగా వసూళ్ళు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కాలుష్యం పేరుతో సెడన్ డిజిల్ వాహనాలను 5 సంవత్సరాల నుండి ఆపేసింది. దానికి ప్రత్యన్మయంగా సిఎన్జి మరియు ఎలెక్ట్రిక్ వాహనాలు అందుబాటు లోకి తెచ్చింది. కానీ సిఎన్జి వాహనాలకు సరిపోయే బంకులు లేకపోవడం వల్లే ఈ సమస్య అంత వస్తుందని వాహన దారులు నిరుత్సాహ పడుతున్నారు. ఇకనైనా సంబదిత అధికారులు స్పందించి వినియోగదారుల నుండి ఎస్ట్ర ₹10 వసూళ్లు చేసే వారిపైన చర్యలు తీసుకోవాలని సరిపోయినన్ని సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button