
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- ర్యాగింగ్ తట్టుకోలేక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పోచారం సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో జాదవ్ సాయి తేజ అనే విద్యార్థి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతిరోజు కూడా ఈ కాలేజీలో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారంటూ స్టూడెంట్ సాయి తేజ సూసైడ్ వీడియో తీసుకున్నారు. ప్రతిరోజు వాళ్లు తాగిన మందు బిల్లుకు డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నారని.. ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అంటూ సూసైడ్ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోని స్నేహితులకు అలాగే తన కుటుంబ సభ్యులకు పంపించి ఆ తరువాత వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చాలా వైరల్ అవుతుంది. ఈ ఘటన పరిశీలించిన మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని… మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు.
Read also : విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు : బొత్స
ఈ మధ్య ర్యాగింగ్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు మరణించిన వార్తలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయినా కానీ విద్యార్థుల్లో ఎటువంటి మార్పులు మాత్రం రావడం లేదు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులే దగ్గరుండి తమ బిడ్డలకు మంచి,చెడులు చెప్పాలని… లేదంటే ఈ కాలం విద్యార్థులు ఎంతకైనా తెగిస్తారు అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ప్రతి ఒక్క కాలేజి యాజమాన్యానికి కూడా పోలీస్ అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్క కాలేజీలో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉంచారు. అయినా కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా మాత్రం మారట్లేదు. ఇలాంటి నేరాలు జరగకుండా విద్యార్థులకు కఠిన ఆంక్షలు ఉన్నటువంటి కొన్ని చట్టాలను తీసుకురావాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Read also : ఖాళీగా తిరుమల కొండ… కీలక వ్యాఖ్యలు చేసిన అధికారులు!