
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్ స్కి అమెరికా గడ్డపై ఉండి అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ తో గొడవపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. అయితే అసలు అతనికి ఎలా ఆ దైర్యం వచ్చిందని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో జలెన్స్ కి మరియు ట్రంప్ గొడవ పడుతున్న విజువల్స్ మనందరం సోషల్ మీడియాలో చాలా సార్లు చూసి ఉంటాం. అసలు ఓ సాధారణ వ్యక్తి ఉక్రెయిన్ దేశానికి అధ్యక్షుడు కావడమే కాకుండా అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ట్రంప్ మీద గొడవ పడడానికి చాలా కారణాలు ఉండి ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ మెదిలే ప్రశ్న అసలు ఈ జలెన్సుకి ఎవరు?…. ఒకసారి ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం.
తెలంగాణ రాజకీయాల్లో వీహెచ్ మార్క్ – మున్నూరు కాపులంతా ఏకమయ్యారా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి యూదు మతానికి చెందిన ఒక వ్యక్తి. ఆయన పూర్వీకులు జర్మన్ నాజీల చేతులో అత్యకు గురయ్యారు అట. జెలెన్స్కి 1978లో జన్మించారు. దాదాపు 20 సంవత్సరాలకు పైగా టీవీ ప్రోగ్రాంలో నటుడిగా మరియు స్టాండ్ అప్ కమెడియన్ గా ఇతను చాలా కార్యక్రమాలు చేశారట. ఆ తరువాత అవినీతికి వ్యతిరేకంగా కాంపెయినింగ్ చేయడం ప్రారంభించారు . 2018లో సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే పార్టీని స్థాపించి… 2019లో ఘన విజయం సాధించి ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇతని ఆస్తి సుమారుగా 250 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం ఉంది.
ఇక ప్రస్తుతం ఇతను చాలా ధైర్యం గల వ్యక్తి అని సోషల్ మీడియా చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈయన 2019లో ప్రెసిడెంట్ కాగానే 2020లో కరోనా సవాలను విసిరింది. 2022లో రష్యా యుద్ధానికి దిగింది. జలన్ కి స్వయంగా సైనికుడిగా మారి యుద్ధ రంగంలో పాల్గొని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా యూఎస్ నుంచి లక్షల కోట్ల సహాయాన్ని కూడా పొందారు. అంతేకాకుండా ఆ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఈయనకు ఆత్మగౌర్యం మరియు వినయం ఎక్కువ అని అలాగే మద్దతుదారులు, ఇంతకాంక్ష కూడా ఎక్కువే అని చెబుతున్నారు. ఆ దేశంలోని ప్రతిపక్ష నేతలు కూడా ఇతని ధైర్యాన్ని చూసి షాక్ అవుతారు.