
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రస్తుత రోజుల్లో మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ కూడా తెలియదు. కానీ అప్పటివరకు సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చిన్నచిన్న కారణాల ద్వారానే అప్పటికప్పుడు మృతి చెందిన సందర్భాలు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇక తాజాగా ఒక పెన్సిల్ కారణంగా యూకేజీ చదువుతున్నటువంటి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ బాలుడి కుటుంబంతోపాటు ఆ బాలుడు చదువుతున్న స్కూల్ మొత్తం దుఃఖానికి గురయ్యారు. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా, నాయకన్ గూడెంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి విహార్ (6) అనే బాలుడు జోబులో పెన్సిల్ పెట్టుకొని సరదాగా స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో ఆ జోబులో ఉన్నటువంటి పెన్సిల్ ఛాతికి గుచ్చుకుంది. అది గమనించిన విద్యార్థులు టీచర్లకు చెప్పగా వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. దీంతో ఒక పెన్సిల్ చిన్నారిపాలిట యమపాశం లా మారింది. బాలుడు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులతో పాటు ఆ గ్రామం, ఆ స్కూల్ విద్యార్థులు మొత్తం కూడా దుఃఖానికి లోనయ్యారు.
Read also : ఆన్ లైన్ గేముకు బలైపోయిన దెబ్బడ గూడ గ్రామానికి చెందిన వాస్పురి విక్రమ్
Read also : చలికాలంలో మూత్రం రంగు మారుతోందా..? అయితే కారణాలు ఇవే!





