
UK Surgeon Chopped Off His Legs: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అక్రమార్కులు రకరకాల మోసపూరిత పనులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ అక్రమాల్లో ఎదుటి వాళ్లు ఇబ్బందులు పడుతారే తప్ప, చీటర్లకు ఏం కాదు. కానీ, ఓ డాక్టర్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏకంగా సొంత కాళ్లను నరుక్కున్నాడు. సుమారు 5.4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది. ఇన్సూరెన్స్ సంస్థలు కోర్టుకు వెళ్లడంతో ఈ వ్యవహారం బయటపడింది.
కాళ్లు నరుక్కునేందుకు మరో డాక్టర్ సాయం
అక్రమంగా ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు బాధితులు తన కాళ్లను నరికేసుకున్నాడని ఇన్సూరెన్స్ సంస్థలు కోర్టుకు వెళ్లాయి. ఉద్దేశపూర్వకంగానే నెయిల్ హాపర్ అనే డాక్టర్ ఈ పని చేశాడని ఆరోపించాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. మారియస్ అనే వైద్యుడి సలహాతోనే ఆయన తన కాళ్లు తొలగించుకున్నాడని ఇన్సూరెన్స్ సంస్థలు ఆరోపించాయి. నెయిల్ తో పాటు మరికొంత మంది కాళ్లను తొలగించేందుకు మారియస్ ప్రయత్నించాడని కోర్టుకు విన్నవించాయి.
నెట్ లో వీడియోలు చూసి కాళ్లు తొలిగింపు
నెయిల్ తన కాళ్లను తొలిగించుకునేందుకు నెట్ పలు వీడియోలను చూశాడు. శరీరానికి ఎలాంటి హాని కలగకుండా కాళ్లు ఎలా తొలగించాలో తెలుసుకున్నాడు. వాటి ఆధారంగా డాక్టర్ మారియస్ తో తన రెండు కాళ్లను తొలిగించుకున్నాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ సంస్థల నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. తనకు రక్తనాళ సంబంధ సమస్యలు ఉన్నాయి. కాళ్లు తొలగించకపోతే శరీరమంతా వ్యాపిస్తుందని నమ్మించాలని చూశాడు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వాలేదనే కారణంగా ఆయనకు ఫైల్ పక్కన పెట్టాయి. ఈలోగా డాక్టర్ మారియస్ వ్యవహారం బయటకు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నెయిల్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసేందుకు ప్రయత్నించడంతో ఆయనపైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also: విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ మృతి.. డెడ్ బాడీ మిస్సింగ్!