
UIDAI: సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని UIDAI మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఆధార్‌ను దుర్వినియోగం చేసే ఘటనలు పెరుగుతున్నాయనే నేపథ్యంలో ప్రతి ఆధార్ హోల్డర్ తన ఆధార్ ఎప్పుడు, ఎక్కడ అథెంటికేషన్‌కి ఉపయోగించబడిందో తరచూ చెక్ చేసుకోవాలని సూచించింది. ఇతరులు మీ ఆధార్ నంబర్‌ను తెలియకుండా ఉపయోగించి ఉంటే వెంటనే గుర్తించడానికి ఇది అత్యంత ఉపయోగపడుతుందని UIDAI స్పష్టం చేసింది.
ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చూడటం చాలా సులభం. ముందుగా My Aadhaar పోర్టల్‌ను ఓపెన్ చేసి, మీ ఆధార్ నంబర్ లేదా UIDతో లాగిన్ కావాలి. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అందులో ‘Aadhaar Authentication History’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గత ఆరు నెలలలో మీ ఆధార్ ఉపయోగించిన ప్రదేశాలు, ఉపయోగ విధానం, అథెంటికేషన్ రకం వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ ఆధార్‌ను ఎవరు వాడుతున్నారు, ఎప్పుడు వాడుతున్నారు, ఏ సేవలకు వినియోగిస్తున్నారు అనే వివరాలు అందులో అందుబాటులో ఉంటాయి.
ఇటీవల బ్యాంకింగ్ సర్వీసులు, మొబైల్ సిమ్, వెల్ఫేర్ స్కీమ్స్ వంటి అనేక సేవల్లో ఆధార్ అవసరం అవుతోంది. ఈ సమయంలో తప్పుడు చేతుల్లో ఆధార్ నంబర్ పడితే మోసాలకు అవకాశం ఉంటుంది. అందుకే UIDAI ప్రత్యేకంగా ప్రజలకు నెలకొకసారి అయినా ఆధార్ హిస్టరీని చూసుకోవాలని, అనుమానాస్పద అథెంటికేషన్ కనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచిస్తోంది. ఈ చర్యలతో మీ వ్యక్తిగత డేటా, సేవలు, బ్యాంక్ అకౌంట్లు మరింత భద్రంగా ఉంటాయని UIDAI చెబుతోంది. ఆధార్ హిస్టరీని చెక్ చేయడం అలవాటుగా చేసుకుంటే సైబర్ మోసాలను సులభంగా అరికట్టవచ్చు.
ALSO READ: Telangana: స్కూళ్లకు సెలవులు





