అంతర్జాతీయం

UAE President: 3 గంటల పర్యటన కోసం 6 గంటల ప్రయాణం.. ఏం జరుగుతోంది?

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ కు వచ్చి వెళ్లారు. ప్రధాని మోడీ స్వయంగా ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.

UAE President India Tour:  యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 2 గంటల పర్యటన కోసం భారత్‌ కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. యూఏఈ అధ్యక్షుడ్ని ఆలింగనం చేసుకోవడంతో పాటు ఎయిర్‌పోర్ట్‌ నుంచి వారిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఆయన కుటుంబ సభ్యులను కొత్త అధికార నివాసానికి మోడీ తీసుకెళ్లారు. భారత సంప్రదాయ బహుమతులను వారికి అందజేశారు.

3 గంటల పర్యటన కోసం.. 6 గంటల ప్రయాణం

సుమారు 3 గంటల అధికార పర్యటనకు వచ్చిన యూఏఈ అధ్యక్షుడితో పలు అంశాలపై ప్రధాని మోడీ చర్చించారు. ఆయనను ఆత్మీయ మిత్రుడిగా ఎక్స్‌ పోస్ట్‌లో మోడీ అభివర్ణించారు. ప్రస్తుతం మిడిల్‌ ఈస్ట్‌ లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇరాన్ లో కల్లోలం, సౌదీ-యుఏఈ మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చలు లాంటి సమస్యల నేపథ్యంలో ఫోన్ లో కాకుండా నేరుగా చర్చించే బలమైన విషయం ఏదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అటు ప్రధాని మోడీ ప్రత్యేక ఆహ్వానం మేరకు రెండు గంటల పర్యటనకు ఆయన వచ్చారని యుఏఈ అధికారులు వెల్లడించారు. యూఏఈ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇది మూడోసారి. గత పదేళ్లలో ఐదో పర్యటన కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button