తెలంగాణ

బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులు అరెస్ట్!

మాదాపూర్,క్రైమ్ మిర్రర్:- బైక్ చోరీ లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మంగళవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరాబండకు చెందిన వెంకట్ (19), జీవన్ (18) ఇద్దరూ స్నేహితులు వెంకట్ సెంట్రింగ్ పని చేస్తుండగా జీవన్ ఓ ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన వీరు ఈజీమనీ కోసం దొంగతనలు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇళ్లు, కార్యాలయాల ముందు ఉన్న వాహనాలను చోరీ చేసి వాటిని అమ్ముకోగా వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు. విసిబుల్ పోలీసింగ్ లో భాగంగా మాదాపూర్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో బైక్ పై వచ్చిన వారిని ఆపి బైక్ నెంబర్పై ఉన్న ఛలాన్లు చెక్ చేయగా అది గతంలో చోరీకి గురైన వాహనంగా గుర్తించారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీలకు పాల్పడుతు న్నట్లు నిందితులిద్దరూ అంగీకరించారు. వారి వద్ద నుండి 5 బైకులు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండు కు తరలించారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసిన మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్, క్రైమ్ డిఐ విజయ్ నాయక్, ఇతర పోలీస్ సిబ్బందిని ఏసీపీ శ్రీధర్ అభినందించారు.

Read also : “వీళ్ళకి ఇంత బలుపా”.. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ పై ఫైర్ అవుతున్న ఇండియన్ నెటిజన్స్

Read also : గుండెపోటు కారణంగా తుది శ్వాస విడిచిన మాజీ ముఖ్యమంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button