![](https://b2466033.smushcdn.com/2466033/wp-content/uploads/2025/02/IMG-20250211-WA0002-780x470.jpg?lossy=1&strip=1&webp=1)
క్రైమ్ మిర్రర్,ఆన్లైన్ డెస్క్ :- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఒక యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి చనిపోతున్నానని బంధువులకు వీడియో పెట్టడంతో వాళ్లు వెంటనే పోలీసులకు తెలపడంతో ఆ వ్యక్తిని ఆరే ఆరు నిమిషాలలో కాపాడారు పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా అయినవెల్లి మండలం కు చెందిన ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో చనిపోదామని నిర్ణయించుకున్నాడు. ఇక చనిపోదాము అనుకొని సెల్ఫీ వీడియో తనకు కావాల్సిన బంధువులకు షేర్ చేశాడు. వెంటనే ఆ బంధువులు గన్నవరం సిఐ భీమరాజుకు సమాచారం అందించారు. ఇక అతను ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయడం కోసం ఐటి కోర్ లో పని చేస్తున్న జాఫర్కు పంపించాడు.
నల్గొండ-హైదరాబాద్ నాన్‌స్టాప్ ఏసీ బస్సుల ప్రారంభం…
వెంటనే స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ను క్రెడియన్షియల్ ఉపయోగించి సెల్ ఐడి తో లాస్ట్ లొకేషన్ ను కనుగొన్నాడు జాఫర్. వెంటనే ఆ లొకేషన్ అనేది సీఐ భీమరాజు కాకినాడ జిల్లా అన్నవరంలో లొకేషన్ రావడంతో వెంటనే అన్నవరం ఎస్ఐ శ్రీహరి గారిని లైన్ లోకి తీసుకొని మాట్లాడారు. ఇక అన్నవరం ఎస్ఐ శ్రీహరి వెంటనే వాళ్ళ సిబ్బందిని ఆ లోకేషన్ కు పంపించి ఆ వీడియో వెనకాల ఉన్న రూం లాడ్జి కావడంతో ఆ లాడ్జ్ ఓనర్స్ గ్రూపులో దాన్ని షేర్ చేసి వాళ్లందర్నీ కూడా చూడమని చెప్పారు. వెంటనే ఒక లాడ్జి యజమాని అతనిని గుర్తించి సరిగ్గా ఉరి వేసుకుంటున్న సమయంలోనే తలుపు బద్దలు కొట్టి అతన్ని కాపాడారు. ఈ రాద్ధాంతం అంతా కూడా అర్ధరాత్రి 11 గంటల 21 నిమిషాలకు జరిగింది. కేవలం ఆరే ఆరు నిమిషాల వ్యవధిలోనే జరగడంతో ఒక నిండు ప్రాణాన్ని పోలీసులు కాపాడగలిగారు.
రాష్ట్రంలో కౌరవుల రాజ్యం..దుర్యోధనుని పాలన!.. రేవంత్ దమ్ముంటే రాజీనామా చెయ్?
ఈ ప్రయత్నంలో విజయం సాధించిన ఆ వ్యక్తిని కాపాడిన సిఐ భీమ్ రాజు గారికి, అన్నవరం ఎఐ శ్రీహరి గారికి, ఐటీ కొర్ కానిస్టేబుల్ జాఫర్ గారికి గ్రామస్తులు మరియు లాడ్జి ఓనర్స్ శభాష్ ఖాకి అన్నలు అంటూ కామెంట్ చేస్తున్నారు. చుట్టూ చీకటి ఉన్న అర్ధరాత్రి 11 గంటల 21 నిమిషాల సమయంలో రెండు జిల్లాల దూరం ఉన్నా కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. మూడు ఖాకిలు ఒకటైన తరుణం ఆపై విజయం సాధించింది అంటూ ప్రతి ఒక్కరూ శభాష్ అని పోలీసులను మెచ్చుకుంటున్నారు.