మహేశ్వరం ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): ప్రమాదవశాత్తు చెరువులోపడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీ తండాలో చోటు చేసుకుంది.
పోలీసుల అంచనా ప్రకారం..సరదాగా ఆడుకుంటూ చెరువు వద్దకు వెళ్లిన కేసీ తండాకు చెందిన జటావత్ రిషి(6), జటావత్ బద్రీనాథ్(8) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలో ఆడు కునేందుకు మధ్యాహ్న సమయంలో ఇంటినుంచి వెళ్లారు.
రాత్రి అయిన ఇంటికి రాకపోవడంతో కుటుంభ సభ్యులు మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి మహేశ్వరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆడుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలో ఉన్న కొత్వాల్ చెరువులో పడిపోయారని అనుమానంతో చెరువులో పోలీసులు, రిస్క్యు టీం సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు ఆదివారం రాత్రి నుండి చేపట్టగా కొన్ని గంటల తర్వాత సోమవారం ఉదయం జటావత్ రిషి(6), జటావత్ బద్రీనాథ్(8) మృతదేహాలను వెలికితీశారు.
పోస్టు మార్టూమ్ నిమిత్తం ఇద్దరి మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.





