
నూతనకల్, క్రైమ్ మిర్రర్ :-
విద్యుత్ షాక్ తో రెండు ఎద్దులు మృత్యువాత పడ్డ సంఘటన మండల పరిధిలోని ఎడవల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఎడవెల్లి ఏనే కుంటలో మేతకు వెళ్లిన మున్న గంగమల్లు,బయ్య గంగయ్య కు చెందిన చెరొక ఎద్దులు పోట్లాడుకొని ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను తగలడంతో విద్యుత్ షాక్ కు గురై 2 ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి.వీటి విలువ లక్ష 50 వేల వరకు ఉంటుందని ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ని అరెస్ట్ చేయించింది మా ప్రభుత్వం కాదు : యాంకర్ శ్యామల
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న తుఫాను.. ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు!