వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కల్లోలం తీవ్రమైంది. వైఎస్సార్ ఫ్యామిలీ నిట్టనిలువునా చీలింది. కొంత కాలంగా అన్న జగన్ తో వార్ చేస్తున్నారు షర్మిల. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నను ఓడించాలని బహిరంగాంగానే ఓటర్లకు పిలుపిచ్చారు. తల్లి విజయలక్ష్మి కూడా జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన కూతురు షర్మిలకే మద్దతు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్ కుటుంబంలో చిచ్చు మరింత పెరిగింది. ఏకంగా కోర్టుకు చేరింది. ఆస్తుల గొడవలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను ఏకంగా కోర్టుకు లాగారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.
తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మోసం చేశారంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్‌లో కేసు వేశారు వైఎస్ జగన్. సెప్టెంబర్ లోనే జగన్ ఈ పిటిషన్ వేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వచ్చే నెలలో విచారణ జరగనుంది. తల్లి, చెల్లిపై ప్రతీకార జ్వాలతో రిగిపోతున్న జగన్ తీరు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో కాక రేపుతోంది.
వైఎస్సాఆర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి సరస్వతి పవర్ కంపెనీ పెట్టారు. పల్నాడులో పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున తక్కువ మొత్తానికి భూములు కొన్నారు. సరస్వతి పవర్ కంపెనీలో కొన్ని షేర్లను తన తల్లి, చెల్లికి కేటాయించారు. అయితే కొన్ని రోజుల క్రితం విజయమ్మ తనకు కేటాయించిన షేర్లను వైఎస్ షర్మిలకు బదిలీ చేసింది. దీనిపై కోర్టుకు వెళ్లారు వైఎస్ జగన్. విజయమ్మ షేర్లను అక్రమంగా షర్మిలకు బదలాయించిందని.. ఇది తనకు ఇష్టం లేదని.. తన షేర్లు తనకు ఇచ్చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు జగన్. ఈ పిటిషన్‌లో జగన్ భార్య భారతి కూడా సహ పిటిషనర్ గా ఉన్నారు.
Read More : సీఎం రేవంత్ కు దిమ్మతిరిగే షాక్.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జంప్.!
భార్యతో కలిసి తల్లి, చెల్లిని జగన్ కోర్టుకు లాగారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో వైఎస్ కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది.