బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసులో ఇవాళ తీర్పు రానుంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు కొట్టి వేయాలంటూ కేటీఆర్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. ఇటీవలే ఈ పిటిషన్‌పై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది హైకోర్టు.
మరోవైపు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలకు సంబంధించి మరో కేసు నమోదు చేసేందుకు ఈడీ రెడీ అవుతోంది. మంగళవారం విచారణకి హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున తాను రాలేనంటూ కేటీఆర్ బదులిచ్చారు. హైకోర్టుపై ఉన్న గౌరవంతో… తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు కేటీఆర్. ఈ మేరకు ఈడి కి తన సమాధానం పంపారు. కేటీఆర్ వినతికి ఈడీ సానుకూలంగా స్పందించింది. హైకోర్టు తీర్పును బట్టి తదపరి కేటీఆర్ ను విచారించేందుకు సమయం ఇవ్వనుంది ఈడీ.