తెలంగాణ కేబినెట్ సమావేశం సాయంత్రం జరుగనుంది. న్యూఇయర్ లో జరుగుతున్న తొలి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా సంచలన ప్రకటనలు ఉంటాయని తెలుస్తోంది.కేబినెట్ భేటీలో రైతు భరోసా అమలుపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
పంట వేసిన ప్రతి రైతుకూ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే గతంలో దాదాపు 65 లక్షల మంది రైతు భరోసా రాగా.. ఈసారి అందరికి ఇస్తారా లేక కోతలు పెడతారా అన్నది తేలాల్సి ఉంది. ఏడు లేదా 10 ఎకరాలకు కటాఫ్ పెడతారనే ప్రచారం సాగుతోంది. ఉద్యోగులు, ఐటీ ప్లేయర్స్ కు రైతు భరోసా కట్ చేస్తానరనే వార్తలు వస్తున్నాయి. వీటన్నంటికి మంత్రివర్గ సమావేశంలో క్లారిటీ రానుంది. రైతు భరోసా కోసం రైతుల నుంచి మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉందని తెలుస్తోంది. .
మరో ప్రధాన అంశంమైన రేషన్ కార్డుల జారీపైనా క్యాబినెట్ చర్చించనుంది. రేషన్ కార్డులను ఎప్పటి నుంచి జారీ చేయాలనే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అంశాలపై కూడా చర్చ జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే యాదగిరి గుట్టకు కూడా ఒక బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.