అంతర్జాతీయం

ట్రంప్ సూపర్ డాన్స్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్?

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయ న్యూస్ :- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా డాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ట్రంప్ డాన్స్ వేసిన వీడియో వైట్ హౌస్ తాజాగా X లో పోస్ట్ చేసింది. ఇది క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా చాలా వైరల్ అయ్యింది. అమెరికా నేవీ 250వ వార్షికోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక 10 సెకండ్ల పాటు తనకు వచ్చిన స్టైల్ లో డాన్స్ వేశారు. ట్రంప్ డాన్స్ వేస్తున్న సమయంలో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా చప్పట్లతో కేరింతలు పెట్టారు. ట్రంప్ ఉన్నచోటనే ఉండి సాంగ్ కు తగ్గట్టు రిథమ్ తో అటు ఇటు కాళ్లు, చేతులు ఊపుతూ అక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా ఉత్సాహాన్ని నింపారు. ఇదంతా ఒక ఎత్తైతే… మరోవైపు ఇతర దేశాల ప్రజలు ట్రంప్ ఫై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రపంచ దేశాలపై టారిఫ్ ల పేరిట ఆంక్షలు పెడుతూ నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావా ట్రంప్ అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొంతమంది వారికి నచ్చినట్లుగా కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే మరో వైపు కొంతమంది ట్రంప్ సపోటర్స్ మాత్రం అది తన వ్యక్తిగతమని.. అది తను దేశం కోసం చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో ఎవరు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ట్రంప్ డాన్స్ చేయడం ఇది మొదటిసారి కాదు. చాలా సందర్భాల్లో ట్రంప్ ఇలానే రిథమ్ తో ఉన్నచోటనే కాళ్లు,చేతులు కదుపుతూ అందరినీ ఉత్సాహపడేలా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Read also : హౌస్ ఫుల్…! నాలుగు రోజుల్లోనే భారీగా కలెక్షన్లు

Read also : చర్యలకు సిద్ధం… నేను కూడా రెడీ అంటున్న విజయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button