Trump deadline To Zelenskyy: రష్యా- ఉక్రెయిన్ యుధ్దానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు సంబంధించి తాము ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అంగీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. రష్యా ఆక్రమించిన కొన్ని భూభాగాలను ఆ దేశానికి అప్పగించేందుకు ఉక్రెయిన్ సమ్మతించాలని సూచించారు. ప్రస్తుతం రష్యాది పైచేయిగా ఉంది కాబట్టి, జెలెన్‌స్కీ సహకరించాలన్నారు.
వెనక్కి తగ్గనంటున్న జెలెన్‌స్కీ
ట్రంప్ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ జెలెన్‌స్కీ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. రష్యాకు తమ భూభాగాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. అలా అప్పగించేందుకు తమ ప్రభుత్వానికి అధికారాలు లేవని కూడా స్పష్టం చేశారు. తన భూభాగాలను వదులుకోవాలని రష్యా తెస్తున్న ఒత్తిడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గమన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమన్నారు. మా భూభాగాలను వేరే దేశానికి అప్పగించే ప్రయత్నం చేయబోమన్నారు.
యూరప్ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం
శాంతి ప్రణాళికకు అనుకూలంగా అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అనుకూలంగా యూరప్ దేశాల మద్దతు కూడగట్టేందుకు జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు. వివిధ దేశాలలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా పోప్ లియో-14ను జెలెన్ స్కీ కలిసి చర్చలు జరిపారు. మీడియా ప్రతినిధులతో వాట్సాప్ ఛాట్ ద్వారా వివరాలు పంచుకుంటున్నారు.





