Saturday, March 28, 2026
Homeఅంతర్జాతీయంఇరాన్ అణు స్థావరాలపై దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ అణు స్థావరాలపై దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Trump Reaction: ఇరాన్ న్యూక్లియర్ సెంటర్ల మీద అమెరికా జరిపిన దాడులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అణుక్షేత్రాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించినప్పటికీ, అందులో వాస్తవం లేదంటున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు. ట్రంప్ చెప్పిన మాటలు పూర్తిగా నిజం కాదంటున్నాయి. అమెరికా దాడులు నిజమే అయినప్పటికీ, పూర్తిగా ధ్వంసం చేసిందనే ట్రంప్ స్టేట్మెంట్ లో వాస్తవం లేదంటున్నాయి. ఈ మేరకు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ సహా పలు వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి.

మీడియా కథనాలను ఖండించిన ట్రంప్

అటు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా చేసిన దాడుల గురించి రాసిన కథనాలను ప్రెసిడెంట్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ నకిలీ వార్తలుగా కొట్టిపారేశారు. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ లో ఈ వార్తలపై విరుచుకుపడ్డారు. చారిత్రాత్మకమైన ఈ దాడులను కొన్ని మీడియా సంస్థలు చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ఇరాన్ లో అణు స్థావరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని మరోసారి తేల్చి చెప్పారు. ఈ మీడియా సంస్థలు ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయని ట్రంప్ తేల్చి చెప్పారు.

వార్తలను ఖండించిన వైట్ హౌస్

అటు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ కూడా మీడియా కథలను పూర్తిగా తప్పుబట్టారు. ఈ నివేదికలు ట్రంప్ ను అవమానించేందుకు చేసిన ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. 14 లక్షల కిలోల బాంబాఉలను కచ్చితమైన లక్ష్యాల మీదే వేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు.

ఢిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చెప్పిందంటే?

జూన్ 22న అమెరికా ఇరాన్ లోని మూడు అణు స్థావరాలు అయిన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌లపై దాడులు జరిపింది. ఈ దాడులపై డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలక నివేదిక వెల్లడించింది. ఈ దాడుల్లో ఇరాన్ న్యూక్లియర్ ప్రధాన భాగాలను ధ్వంసం కాలేదని వెల్లడించింది. ఈ దాడులతో జస్ట్ కొన్ని నెలలు మాత్రమే న్యూక్లియర్ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అమెరికా దాడులతో న్యూక్లియర్ సౌకర్యాలకు నష్టం జరిగినప్పటికీ,  మౌలిక సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని వెల్లడించింది.

Read Also: ఉద్రిక్తతల పరిష్కారానికి సిద్ధం.. భారత్ కీలక ప్రకటన!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments