Sunday, March 1, 2026
Homeఅంతర్జాతీయంTrump-Khamenei: ఖమేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచలన పోస్ట్!

Trump-Khamenei: ఖమేనీ చనిపోయాడు.. ట్రంప్ సంచలన పోస్ట్!

  • టెహ్రాన్‌లోని నివాసంపై వైమానిక దాడులు

  • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడన్న ట్రంప్

  • సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో పోస్టు

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తున్నాయి. ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా శనివారం ఉదయం టెహ్రాన్‌పై దాడులకు పాల్పడ్డాయి. టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ నివాసాన్ని టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ దళాలు దాడులకు దిగాయి. ఈ దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి జెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఖమేనీ చనిపోయాడనడానికి చాలా సంకేతాలు ఉన్నాయన్నారు.

భయంకరమైన వ్యక్తి చనిపోయాడన్న ట్రంప్  

వైమానిక దాడుల్లో ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ది ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. “చరిత్రలోనే అత్యంత భయంకరమైన వ్యక్తి ఖమేనీ చనిపోయాడు. ఖమేనీ కారణంగా.. అతడి గ్యాంగ్ కారణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైన ఇరాన్, అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల ప్రజలకు న్యాయం జరిగింది. దేశాన్ని తిరిగి సొంతం చేసుకోవటానికి ఇరాన్ ప్రజలకు దక్కిన అద్భుతమైన అవకాశం ఇదే. ఇరాన్‌పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతాయి” అని రాసుకొచ్చారు.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments