
Donald Trump Tariff: భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకంతో పాటు జరిమానా విధించడం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం భారత్ తో పాటు అమెరికాకు నష్టమే అంటున్నారు. భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న పలు ఉత్పత్తులపై తక్కువ టారిఫ్ లు ఉండేవి. అమెరికన్లు ఆయా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. ట్రంప్ తాజా నిర్ణయంతో స్మార్ట్ ఫోన్లు, రెడీమేడ్ దుస్తులు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆభరణాలు, పాలిష్డ్ వజ్రాలు, పలు కీలక ఔషధాల ధరలు భారీగా పెరగనున్నాయి.
అమెరికన్ల పైనా పెను భారం
ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న మిడ్ రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు.. యాపిల్ ఫోన్ల కాంపొనెంట్లు భారత్‌లోనే అసెంబుల్ అవుతున్నాయి. ఇటీవలికాలంలో ఐఫోన్లు భారత్ లో పెద్ద ఎత్తున తయారై అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వాటన్నింటిపైనా 25% సుంకం విధించడం వల్ల అమెరికన్ వినియోగదారులపై పెనుభారం పడుతుంది. తాజా సుంకాల పెంపుతో అమెరికాలో దుస్తుల ధరలు 175 దాకా పెరుగుతాయి. అమెరికా ప్రజలు వినియోగించే జనరిక్ ఔషధాల్లో 405 ఇండియా నుంచే సరఫరా అవుతున్నాయి. వాటి ధరలకు కూడా పెరుగుతాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి.
భారత్ కూ నష్టమే!
ట్రంప్ సుంకాల ప్రభావం అమెరికన్లతో పాటు భారత్ పైగా పడనుంది. 25 శాతం సుంకం, దానికి తోడుగా జరిమానా విధిస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా గనక 20 శాతం అంతకంటే ఎక్కువ సుంకాన్ని విధిస్తే.. భారత జీడీపీపై 0.5% ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also: భారత్‌పై అమెరికా టారిఫ్ బాంబ్