హీరోయిన్ త్రిష తన మనసులోని మాటను తాజాగా బయటకు వెల్లడించారు. దాదాపుగా 20 సంవత్సరాల పాటు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి చాలా పేరు తెచ్చుకున్నారు. అయితే తాజాగా త్రిష చెప్పిన వ్యాఖ్యలు తమిళనాడు రాష్ట్రంలో హైలెట్గా నిలిచాయి. రాజకీయరంగంలోకి ప్రవేశించాలని , రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించాలని తన మనసులోని కోరికను బయటకు పెట్టింది.
Ap లో మరో ఏడు కొత్త విమానాశ్రయాలు!..గన్నవరం లో స్పెషల్?
తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనేదే నా కోరిక అని ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ త్రిష చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటుగా ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని వాటిని తీర్చాలని ఉందని తన మనసులోని రాజకీయ ఇష్టాన్ని బయటకు తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఒకవైపు సినిమా రంగంలోనూ మరోవైపు రాజకీయ రంగంలోనూ చర్చనీయాంశంగా మారిపోయింది.
రాజు లేని రాజ్యంలా టీంఇండియా.. నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!!
కాగా ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో సినిమా రంగం నుండి వచ్చి ఎంజీఆర్ మరియు జయలలిత తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు త్రిష కూడా అదే బాటలో నడవాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ఈమె మనసులోని కోరికను బయటపెట్టిన అనంతరం చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా త్రిష కు సపోర్ట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఇప్పటివరకు ఉన్నవారు చాల రా మళ్లీ మీరు కొత్తగా వచ్చి ఏం చేస్తారని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. దీంతో త్రిష గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.