తెలంగాణ

నాంచారి పేట నూతన సర్పంచ్ కి సన్మానం

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్:- యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం నాంచారిపేట గ్రామ సర్పంచిగా ఎన్నికైన బెల్లి మల్లేష్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు సికింద్రాబాద్ జిల్లా మహంకాళి వైస్ ప్రెసిడెంట్ కందడి నాగేశ్వర్ రెడ్డి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామమైన నాంచారి పేటలో యువతకు రాజకీయంగా ప్రాధాన్యతనిస్తూ అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించుకున్న గ్రామ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కంది వెంకట్ రాంరెడ్డి,మండల వైస్ ప్రెసిడెంట్ పైళ్ల దయాకర్ రెడ్డి, ముస్కు పుల్లారెడ్డి,బచ్చే పర్వతాలు,పీసరి మల్లారెడ్డి, పోతగాని వెంకటేశ్వర్లు,పైళ్ళ వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Read also : ఉకోండిలో మంచినీటి సమస్య లేకుండా చూస్తాం

Read also : అభివృద్ధి పథంలో.. అంబట్ పల్లి…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button