
క్రైమ్ మిర్రర్, న్యూస్ :- టీమిండియాకు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఎందుకంటే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు తెలిపారు. కొద్దిరోజుల క్రితమే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులు గడవకముందే ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. గత ఏడాదిలో భారత్ ప్రపంచకప్ విజయం సాధించిన తరువాత రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించి టి20 నుండి తప్పుకున్నారు. వీళ్ళ స్థానంలో ఇప్పుడు భారత యంగ్ స్టార్స్ ఆడుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం.. చాలామంది విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారేమో అని అభిమానులు భావించారు. కానీ విరాట్ కోహ్లీ ఏమాత్రం రిటైర్మెంట్ పై స్పందించలేదు. ఇవాళ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ గురు రిటైర్మెంట్ ప్రకటించి కోహ్లీ అందరిని కూడా ఆశ్చర్యపరిచారు. ప్రతి ఒక్కరికి కోహ్లీ ఫిట్నెస్ ఏంటో తెలిసిందే. 40 ఏళ్లు వస్తున్నా… ఇంకా 20 ఏళ్ల యువకుడి లాగానే పరిగెత్తుతూ తన ఫిట్నెస్తో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో ఎన్నో రికార్డులను సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు విరాట్ కోహ్లీ. ఈ టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు కూడా విరాట్ కోహ్లీ నమో చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం అనేది అభిమానులను దుఃఖంలో నిట్టేసింది. ఇకపై ఈ స్టార్ బ్యాట్స్మెన్ను టెస్టులో చూడలేమేని దిగులు చెందుతున్నారు. మరికొందరు మాత్రం విరాట్ కోహ్లీ సృష్టించిన రికార్డులను మొత్తం కూడా తిరిగి చూస్తున్నారు.