మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులను రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో మంటలు వస్తున్నాయనే ప్రచారం జరిగింది. దీంతో భయంతో రైలు చైన్ లాగి దూకేశారు ప్రయాణికులు.
అదే సమయంలో పక్క ట్రాక్ పైకి మరో రైలు రావడంతో.. అది ప్రయాణికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో
రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు 20 మంది స్పాట్ లోనే చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.