తెలంగాణ

విషాదం నింపిన పోలియో చుక్కలు… పసిబిడ్డ మృతి!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- సాధారణంగా చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం సాధారణం. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికి పసిబిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రులు షాక్ అవడంతోపాటు శోకంలో మునిగిపోయారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే… ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అక్టోబర్ 12వ తేదీన పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కూడా అన్ని జిల్లాలలో పోలియో చుక్కల కార్యక్రమం చేపట్టారు. కానీ అనుకోకుండా సంగారెడ్డి జిల్లాలో పోలియో చుక్కల కార్యక్రమం ఒక కుటుంబానికి తీవ్ర విషాదం నింపింది. మూడు నెలల పసి బాలుడికి పోలియో చుక్కలు వేసిన కొద్దిసేపటికి మృతి చెందాడు. పోలియో చుక్కలు వేసిన మరుక్షణం లో ఆ బాలుడు వాంతులు అలాగే విరోచనాలు చేసుకోవడంతోపాటు కాళ్లు,చేతులు గిలగిలా కొట్టుకున్నాడు. అది చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆ పసి బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. మరోవైపు వంద మందికి పైగా ఈ పోలియో చుక్కలే వేశామని… వారందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. ఈ పోలియో చుక్కలు పసిబిడ్డ మృతికి సంబంధం లేదు అని డాక్టర్లు అంటున్నారు. మరి ఆ బాలుడు ఏ కారణంగా మరణించారు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకుముందే ఆ బాలుడికి ఏదో అనారోగ్య సమస్య ఉండడం.. ఈ పోలియో చుక్కల కారణంగా అది ఎఫెక్ట్ అయి ఉంటుందని.. దీని కారణంగానే ఆ పసివాడు మృతి చెంది ఉంటాడు అని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఒక పసి బాలుడు మృతి చెందడం పట్ల ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామం మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారులు ఈ విషయంపై స్పందించి మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read also : తుది శ్వాస విడిచిన లక్ష్మారెడ్డి.. మధ్యాహ్నం మూడు గంటలకు అంత్యక్రియలు!

Read also : ఇకపై నేరుగా అభిమానులను కలుస్తా.. అల్లు అర్జున్ కీలక నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button