
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ నటి హేమ తల్లి లక్ష్మి నిన్న రాత్రి సమయంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నటి హేమ కన్నీటి పర్యంతమవుతూ తూర్పుగోదావరి జిల్లాలోని తన స్వగ్రామమైనటువంటి రాజోలుకు చేరుకున్నారు. తన తల్లి లక్ష్మి నిన్న రాత్రి సమయంలో కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ ఉదయం తన స్వగ్రామానికి చేరుకున్న నటి హేమ… మరణించిన తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టేసింది. నటి హేమ ఏడుస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్న తమ బంధువులు అలాగే స్థానిక గ్రామస్తులు అందరూ కూడా కంటతడి పెట్టారు. హేమ ఏడుస్తూనే నిన్న ఉదయం నాతో చాలా బాగా మాట్లాడారు.. రాత్రికి ఇలా మరణించడం చాలా బాధగా ఉంది అంటూనే బోరున ఏడ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న నటీ స్నేహితులు అలాగే ఇతర బంధువులు ఇప్పటికే తన స్వగ్రామానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో అంతక్రియలు కూడా జరుగుతాయని స్థానికులు తెలిపారు. హేమ తల్లి మృతిచెందిన కారణంగా సోషల్ మీడియా వేదికగా హేమ అభిమానులు అందరూ కూడా ఆమెకు ధైర్యం చేకూరుస్తున్నారు.
Viral video: ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం.. మరీ ఇంత దారుణమా..?





