
క్రైమ్ మిర్రర్ , వేములపల్లి:- చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ యువకుడు గల్లంతైన ఘటన వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా.. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన మద్దెబోయిన వెంకన్న, పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు రామకృష్ణ అనే యువకుడు గ్రామంలోని తన స్నేహితులతో కలిసి శుక్రవారం సాయంత్రం చేపల వేట కోసం తన గ్రామం శివారులో ఉన్న మూసి వాగులోకి వెళ్లి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడన్నారు. వెంటనే తన స్నేహితులు అతనిని కాపాడడానికి శతవిధాల ప్రయత్నం చేసిన కూడా ఆ నీటి ప్రవాహానికి ఫలితం లేకపోయింది. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇంత వరకు ఆచూకీ లభ్యం కాలేదన్నారు. ఈ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read also : ఓట్ల చోరీ ఆరోపణలు.. రాహుల్ పై ఈసీ తీవ్ర వ్యాఖ్యలు!
Read also : త్వరగా కోలుకుంటున్న తెలుగు కుర్రాడు నితీష్!.. వైరల్ అవుతున్న స్టోరీ?