
మాదాపూర్,క్రైమ్ మిర్రర్:- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి శనివారం రోజు 100 ఫీట్ రోడ్‌లోని పంచకట్టు హోటల్ సమీపంలో ఉన్న బ్లాక్ స్పాట్ వద్ద రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వాహన వినియోగదారులు పాల్గొనగా, ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ…“సురక్షితంగా ప్రయాణించి గమ్యానికి చేరుకోవడం” అనే ముఖ్య ఉద్దేశంతో హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, రాంగ్ రూట్‌లో వాహనం నడపకుండా ఉండడం, మైనర్లకు వాహనాలు అప్పగించకుండా ఉండడం, నిర్లక్ష్యంగా వాహనం నడపకుండా ఉండడం, మలుపులు మరియు లైటింగ్ లేని ప్రదేశాల్లో నెమ్మదిగా వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం, నో ఎంట్రీ సమయంలో ఓవర్ లోడెడ్ వాహనాలతో సిటీ లోకి రాకుండా ఉండడం వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మాదాపూర్ డిఐ విజయ్ కుమార్ , ట్రాఫిక్ సీఐ శ్రీధర్‌తో పాటు ఎస్.ఐ.లు వీ.రమణ, బాలరామ్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకలపై ఉగ్ర ఛాయలు.. నిఘా వర్గాల హెచ్చరిక.!
మేడారంలో వేడి నీటి బకెట్ 50 రూపాయలు.. వైరల్ అవుతున్న దృశ్యాలు?





