జాతీయం

కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు

బంగాళాఖాతంలో నెలకొన్న వాయుగుండం కారణంగా తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, కడలూరు, నాగపట్టణం, ఎన్నూర్, కాట్టుప్పళ్లి, పుదుచ్చేరి, కారైక్కల్, పాంబన్, తూత్తుక్కుడి తదితర హార్బర్లలో మూడో నెంబరు ప్రమాద సూచిక ఎగురవేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలుగా తిరువళ్లూరు, విళుపురం, తంజావూరు, తిరువారూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్టణం, తిరుచ్చి, రామనాథపురం తదితర జిల్లాల్లో పాఠశాల, కళాశాలలకు సెలవు ఇచ్చారు.

వాయుగండం కారణంగా చెన్నైలో సముద్రం కల్లోలంగా కనిపించింది. ముఖ్యంగా ఎన్నూర్, తిరువొత్తియూర్, కాశిమేడు తదితర ప్రాంతాల్లో అలలు ఎగసిపడ్డాయి. చెన్నైలో ఇవాళ అంటే 29న భారీవర్షం, 30న అతిభారీవర్షం కురుస్తుందని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా 12 విపత్తు నిర్వహణ బృందాలు బాధిత ప్రజలను కాపాడేందుకు రెడీ అయ్యాయి. చెన్నైలోని 12 పోలీసు డిప్యూటీ కమిషనర్‌ కార్యాయాలకు ఒక బృందం చొప్పున 12 బృందాలను ఏర్పాటు చేశారు. చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించేలా యంత్రాలు ఉన్నాయి. చెన్నై వ్యాప్తంగా 18 వేల మంది పోలీసులు సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నారు. మహానగరంలో 35 కంట్రోల్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

రామేశ్వరంలో 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తుండడంతో సముద్రంలో పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. రామనాథపురం జిల్లా రామేశ్వరం, పాంబన్, తంగచ్చిమటం, మండపం తదితర ప్రాంతాల్లో గత వారం ఒక్కరోజులోనే 44 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ ప్రభావం నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా కోలుకోని స్థితిలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మంగళవారం నుంచి భారీవర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా అరిచ్చల్‌మునై, ధనుష్కోటి, కోదండరామర్‌ ఆలయం తదితర చోట్ల పర్యాటకుల సంఖ్య తగ్గింది.

మరిన్ని వార్తలు చదవండి…

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం 

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం 

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button