
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రపంచంలోని టాప్ 20 అత్యంత కాలుష్యమైన నగరాలు ఉన్నట్లుగా IQ air కంపెనీ తాజాగా ప్రకటించింది. అయితే ఈ టాప్ 20 నగరాలలో సగం ఇండియాలోనే ఉన్నట్లుగా తెలిపింది. ఇలా మొత్తంతో పోలిస్తే ప్రపంచంలోనే అత్యంత 20 అత్యంత కాలుష్యమైన నగరాలలో ఏకంగా 13 నగరాలు ఇండియాలోనే ఉన్నట్లుగా ఈ కంపెనీ వెల్లడించడంతో ప్రతి ఒక్కరు షాకుకు గురి అయ్యారు. అయితే అస్సాంలోని బైర్ని హాట్ అనే నగరం అత్యంత కాలుష్య నగరాలలో మొదటి స్థానంలో ఉంది. ఇక అత్యంత కాలుష్యమైన రాజధాని నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. కాగా మనందరికీ మనదేశంలోని ఢిల్లీ మాత్రమే అత్యంత కాలుష్య నగరం గా గుర్తింపు పొందిందని తెలుసు. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా ఇంకా చాలా నగరాలు ఉన్నాయని IQ air ప్రకటించడం జరిగింది.
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సోదరుడు.. యాదాద్రిలో రచ్చ
కాగా మరో వైపు 2024 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ లిస్టులో భారతదేశం ఐదవ స్థానంలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా వాయి కాలుష్యం వల్ల ఆయుర్దాయం 5.2 సంవత్సరాలు తగ్గిపోతుంది అని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం కాలుష్యం వల్ల మాత్రమే దేశంలో ప్రతి సంవత్సరం కూడా వేళల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల్లో ప్రజలు కాలుష్యం బారినపడి మరణించారు. ఇప్పటికీ చాలా మంది కాలుష్యం బారిన పడి అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్న కూడా ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఇలానే కొనసాగుతూ ఉంటే మన భారతదేశం భవిష్యత్తు తరాల్లో గాలి నాణ్యత మరింత క్షీణించి ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశంలోనే ఎక్కువగా కాలుష్యమైన నగరాలు ఉన్నాయి అని తెలుస్తుంది.