
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ఆసియా కప్ లో భాగంగా భారత్ మరియు పాకిస్తాన్ మధ్య రేపు మరోసారి టి20 మ్యాచ్ జరగనుంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్ ను ప్రేక్షకులు ఇప్పటికీ కూడా మర్చిపోలేక పోతున్నారు. మొదటి మ్యాచ్ లో కాసేపు ఉత్కంఠంగా సాగిన .. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి జట్టుకు షేక్ హ్యాండ్, హగ్గు ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయి పాకిస్తాన్ ను అవమానించారు. దీంతో మైదానంలో ఉన్న పాకిస్తాన్ జట్టు అలా చూస్తూ ఉండిపోయింది. ఇది చూసిన భారత క్రికెట్ ప్రేక్షకులు ఎంతగానో ఆనందించి.. పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పారని మన ఇండియన్ క్రికెటర్స్ ను మెచ్చుకున్నారు. అయితే రేపు దాయాది దేశాల మధ్య మరోసారి పోరు జరగనుంది. అది కూడా ఆదివారం కావడంతో ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంది.
Read also : వైసీపీకి బిగ్ షాక్… అనుమతి లేదంటూ పోలీసులు కేసు నమోదు?
అయితే రేపు పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ గురించి టీం ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మ్యాచ్ ఒక కొత్త ఛాలెంజ్ లా ఉంటుంది. రేపు జరగబోయే మ్యాచ్ ను చాలామంది ప్రేక్షకులు వీక్షిస్తారు. ఇండియన్ జుట్టు కచ్చితంగా వారందరినీ ఎంటర్టైన్ చేస్తుంది అని… నిరాశపరచమని సూర్య కుమార్ యాదవ్ మరోసారి ఇండియన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా మాట్లాడారు. పోయిన ఆదివారం లాగానే.. సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ ఎనర్జీతో ఆడి గెలుస్తామన్నారు. ది బెస్ట్ ఇస్తాం.. అని సూర్య కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నిన్న ఓమన్ తో జరిగిన మ్యాచ్ లో ఇతర బ్యాట్స్మెన్లకు అవకాశం ఇచ్చేందుకు నేను బ్యాటింగుకు దిగలేదు అని క్లారిటీ ఇచ్చారు. నాకు నా వ్యక్తిగత స్కోర్ కానీ, రికార్డ్స్ కానీ అవసరం లేదు. టీం గెలిస్తే అదే సంతోషమని సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ దేశాన్ని మరోసారి అవమానించేలా మన క్రికెటర్స్ ఇంకేమైనా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ దేశంపై ఆగ్రహంగా ఉన్నారు.
Read also : అనస్తేషియా హైడోస్.. నిండు ప్రాణం బలి..!