వైరల్సినిమా

2025లో టాలీవుడ్ అంతంత మాత్రమే.. మరి 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి కేవలం ఒకరోజు మాత్రమే అయింది. అయితే ఈ సందర్భంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలు గత ఏడాది అనగా 2025 వ సంవత్సరంలో తెలుగు సినిమాలు అంతంత మాత్రమే రాణించాయి. 300 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కేవలం రెండు సినిమాలు మాత్రమే. పవన్ కళ్యాణ్ OG, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తప్పించి మిగతా ఏ సినిమాలు కూడా అంతగా సక్సెస్ కాలేదు. మరోవైపు దురందర్, చావా అలాగే కాంతారా చాప్టర్ -1 వంటి ఇతర భాషల సినిమాలు 700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం OG మరియు సంక్రాంతికి వస్తున్నాం తప్పించి మిగతా ఏ సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఈ తరుణంలోనే మరి ఈ ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ అయ్యే సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తాయా లేదా అని ప్రేక్షకులు, అభిమానులు చర్చలు ప్రారంభించారు. ఈ 2026వ సంవత్సరంలో ప్రభాస్ నటిస్తున్నటువంటి “రాజా సాబ్, ఫోజీ,” జూనియర్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి పాన్ ఇండియా సినిమాలు వరుసగా లిస్టులో ఉన్నాయి. మరి ఈ తెలుగు హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. మరి ఇందులో ఏ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధిస్తుందో కామెంట్ రూపం లో తెలియజేయండి.

Read also : North Korea: కిమ్ కుమార్తె చేతికి.. నార్త్ కొరియా అధికార పగ్గాలు!

Read also : North Korea: కిమ్ కుమార్తె చేతికి.. నార్త్ కొరియా అధికార పగ్గాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button