చాలామంది ప్రస్తుత తరంలో ఎదిగే కొద్దీ ఆటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు. ఇక ఏదైనా విషయంలో ఫేమస్ అయితే ఇక ఆ వ్యక్తి హద్దుకు అదుపే లేకుండా పోతుంది. అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మనం చాలామంది నే చూసి ఉంటాం. ఇక తాజాగా టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని శబరిమల లో ఒక సామాన్యుడి వ్యక్తిలా కనిపించారు.
అయ్యప్ప మాల ధరించిన హీరో నాని తాజాగా శబరిమల వెళ్లారు. అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటుండగా మీడియా మిత్రులు ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రతి సంవత్సరం కూడా నాని అయ్యప్ప మాల ధరిస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలాసార్లు కూడా హీరో నాని మాల ధరించారు. అయితే ఇక తోటి భక్తులతో శబరిమలలో హీరో నాని చాలా సరదాగా గడిపారు.
ఇప్పుడు ఒక స్థాయికి మనం వచ్చామంటే ఖచ్చితంగా చాలా మందిలో కొంచెం యాటిట్యూడ్ అనేది కనబడుతుంది. కానీ నాని మాత్రం ఎటువంటి యాటిట్యూడ్ లేకుండా దర్శనానికి వెళుతున్న సందర్భంలో తోటి భక్తులతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఫోటోలు తీసుకున్నారు. ఇక శబరిమల వెళ్లి వచ్చిన వెంటనే నాని షూటింగ్స్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉందని తెలిపారు. ఇక ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ త్రీ మూవీ అనేది చేస్తున్నారు. ఈ సినిమాలో నాని జమ్మూ కాశ్మీర్ స్టేట్ పోలీస్గా పాత్రను చేస్తారని డైరెక్టర్ తెలిపారు. ఇక ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఒదిగి ఉండడం నానిని చూసి నేర్చుకోవచ్చని చాలామంది ఉదాహరణగా చెబుతున్నారు.