
-
పారిశ్రమిక ప్రాంతం లో టాడ్ ఏరోస్పెస్ కార్మికులు బిక్షటన చేస్తూ కార్మికుల నిరసన
-
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్
కూకట్ పల్లి, (క్రైమ్ మిర్రర్) : కూకట్ పల్లి నియోజకవర్గం లోని ప్రశాంత్ నగర్ లోని టాడ్ ఏరోస్పెస్ కంపెనీ కార్మికులు వారికీ లేబర్ అధికారులు న్యాయం చెయ్యాలని పారిశ్రమ ప్రాంతం లో బిక్షటన చేస్తూ నిరసన చేశారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ పాల్గొని ఆయన కార్మికుల తరువున మాట్లాడుతూ కార్మికులు టాడ్ ఏరోస్పెస్ కంపెనీ లో దాదాపు గా 12 సం. లుగా పని చేస్తున్న కార్మికులు తమ జీతాలు పెరగాలి, యాజమాన్యం జీతాలు అడిగిన పెంచడం లేదు అని యూనియన్ పెట్టినందుకు కక్ష కట్టి యూనియన్ లో ప్రధాన బాధ్యత లు ఉన్న వ్యక్తులను వేరే రాష్ట్రనికి బధిలి చేస్తాం అని యాజమాన్యం బెదిరింపులకు గురి చేస్తుంది.
వారికీ మద్దతుగా ఉన్న 2వ్యక్తులను కూడా ఉద్యోగం లోకి రావొద్దు అంటూ యాజమాన్యం మొండిగా వ్యవరిస్తుంది. టాడ్ ఏరోస్పెస్ కంపెనీ పై లేబర్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కార్మికులకు న్యాయం చేయ్యాలని లేబర్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమం లో కార్మికులు యూనియన్ ప్రధాన కార్యదర్శి కుమార్, గణేష్, రహీమ్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.