
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఐపీఎల్ 18వ సీజన్ చాలా ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లోనే ఆర్సిబి ఘనవిజయాన్ని సాధించింది. అయితే ఇవాళ డబుల్ ధమాకా మ్యాచెస్ ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగునుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరీ గా జరుగునుంది. దీంతో రెండు మ్యాచ్లు కూడా క్రికెట్ అభిమానులకు ఒక ఎంటర్టైన్మెంట్గా మారుతుంది. ఒకవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ ఫామ్ కనబరుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే రాజస్థాన్ జట్టును కూడా తక్కువ అంచనా వేయలేము. కాబట్టి సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ రసవత్రంగా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఐపీఎల్ నుండి ఇర్ఫాన్ పఠాన్ బ్యాన్!.. కారణమేంటంటే?
ఇక సాయంత్రం 7.30 గంటలకు జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఋతురాజ్, మహేంద్ర సింగ్ ధోని అలాగే హార్దిక్ పాండ్యా మరియు రోహిత్ శర్మ లాంటి హీరోలు ఉన్న జట్టు కాబట్టి ప్రతి ఒక్కరికీ ఈ మ్యాచ్ చాలా ఎంటర్టైన్మెంట్ ను ఇస్తుంది. ఐపీఎల్ అంటేనే ఫ్యాన్స్ కి అలాగే క్రికెటర్స్ కి కూడా పూనకాలే. తొలి డబుల్ ధమాకా ఈరోజే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీవీలకి అతుక్కుపోయే అవకాశాలున్నాయి.