
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల గురించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందా అని ప్రజలతోపాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా వేచి చూస్తున్నారు. ఈ మధ్య బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే విధించడంతో.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే హైకోర్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీంతో సుప్రీంకోర్టు ఇవ్వాలే తన నిర్ణయాన్ని బయటకు ప్రకటిస్తుందా?.. లేక ఈ విషయాన్ని వాయిదా వేస్తూ వెళ్తుందా?.. అనే ఉత్కంఠత ప్రతి ఒక్కరిలోనూ మొదలైంది. రిజర్వేషన్ల హైకోర్టు స్టే విధించడంతో తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి నేడు విచారణ జరిపే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తుందా?.. లేకపోతే వాయిదా వేస్తుందా?.. అనేది మరి కొద్ది సేపట్లో తెలిసిపోనుంది. ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటిస్తే వెంటనే ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు బీసీ సంఘాల నేతలు, పలువురు రాజకీయ నాయకులు అందరూ కూడా ఎల్లుండి జరగబోయేటువంటి రాష్ట్ర బందుకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. మరోవైపు కేటీఆర్ ఈ విషయంపై ఢిల్లీకి వెళ్లి ప్రధానితో చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఈరోజు సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వస్తే ఎన్నికలు జరగాలా లేదా అనేది తెలిసిపోతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం పై వాయిదా వేస్తే బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో మళ్లీ పెద్ద ఎత్తున బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
Read also : తోటి డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
Read also :కల్తీ మద్యం ప్రచారం వేళా.. ఎక్సైజ్ శాఖ కొత్త రూల్స్..!