
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- భారతదేశవ్యాప్తంగా ఈరోజు బందు నిర్వహిస్తున్నారు. దాదాపు పది కేంద్ర కార్మిక సంఘాలు కలిసి నేడు భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చక కొంతమంది కార్మిక హక్కులను కాలు రాయితున్నాయని ఆరోపిస్తూ… ఈ కార్మిక సంఘాలు నేడు బందుకు పిలుపునిచ్చాయి. ఈ బందుకు గల ముఖ్య కారణం కార్మిక సంక్షేమంపై ప్రభావం చూపే విధానాలు. ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు బంధు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ర్యాలీలు మరియు నిరసన కార్యక్రమాలు పలు నగరాలలో చేపట్టనున్నారు. అయితే ఈ బంధు కారణంగా ప్రభావితం అయ్యేటువంటి రంగాలు… ప్రభావితం కానీ రంగాల గురించి తెలుసుకుందాం.
బందు ప్రభావిత రంగాలు :-
ఈరోజు భారతదేశవ్యాప్తంగా బంద్ ప్రభావం కారణంగా చాలా రంగాలు ప్రభావితానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పరిశ్రమలు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు, ప్రజా రవాణా, పోస్టల్ సేవలు ప్రభావితం కానున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులు, వాటి సహకార బ్యాంకులు తాత్కాలికంగా సేవలను నిలిపివేయవచ్చు అని సమాచారం వస్తుంది. ఇక పది ముఖ్య నగరాలలో బస్సులు మరియు ట్రాన్స్పోర్ట్ సర్వీసుల నిలిపివేత కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యధావిధిగా నడిచే అవకాశం ఉంది.
ప్రభావం లేని రంగాలు :-
భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న బందుకు విద్యాసంస్థలు, ప్రైవేట్ ఆఫీసులు పెద్దగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పాఠశాలలు మరియు కళాశాలలు యధావిధిగా ఈరోజు కొనసాగేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రైవేట్ ఐటీ కంపెనీలు అలాగే ప్రైవేట్ కార్యాలయాలు కూడా సాధారణంగా కొనసాగేలా ఆయా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కాబట్టి ఇప్పుడు ముఖ్య నగరాల్లో రవాణా చేసే ప్రయాణికులు తమ ప్రయాణాల గురించి ముందుగానే పరిగణలోకి తీసుకొని ప్లాన్ చేయాలని కోరుతున్నారు.
కృష్ణా నదిపై వంతెనకు సహకరించాలి – ఏపీ సీఎంను కోరిన అచ్చంపేట ఎమ్మెల్యే