
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నేడు బ్రిస్ బేన్ వేదికగా మధ్యాహ్నం 1:45 గంటలకు ఐదవ టి20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదే చివరి t20 కాగా.. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు గెలిచింది అంటే సిరీస్ సమం అవుతుంది. ఈ తరుణంలోనే ఇరుజట్ల మధ్య కూడా ఈ చివరి మ్యాచ్ ఉత్కంఠంగా సాగనుంది. అయితే ఇంతకు ముందే జరిగినటువంటి మొదటి నాలుగు టి20 మ్యాచ్లలో.. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అవ్వగా.. రెండవ టి20 లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఆ తరువాత మూడు మరియు నాలుగు టి20లలో భారత్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఇక చివరిగా ఐదో టి20 మిగిలి ఉండగా అది నేడు జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కూడా కీలకం కానుంది. ఇవ్వాళ జరిగేటువంటి కీలక పోరులో టీమిండియా గెలవాలి అంటే సూర్య కుమార్ యాదవ్ తిరిగి ఫామ్ లోకి రావాల్సి ఉంది. సూర్యతో పాటుగా తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ కూడా ఫామ్ అందుకోవాలని పలువురు ఆశిస్తున్నారు. అయితే ఈ చివరి t20 మ్యాచ్ లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. గిల్ స్తానంలో శాంసంగ్ లేదా దుబే స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Read also : హ్యాపీ బర్త్డే CM సాబ్.. అంత ఈజీగా అయితే పీఠం దక్కలేదు?
Read also : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక… బీఆర్‌ఎస్ నేతల ఇంటిపై సోదాలు… రాజకీయ హీట్





