
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 ప్లే ఆప్స్ దాటుకొని నేడు ఫైనల్ కు చేరింది. ఫైనల్స్ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ kc మరియు పూనేరి పల్టాన్ జట్లు తలపడునున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలువగా.. ఈ రెండు జట్ల మధ్యనే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2021-23 సీజన్ లో ఢిల్లీ టైటిల్ సాధించి జోష్ మీద ఉండగా.. 2023-24 లో పూనేరి పల్టాన్ కప్ నెగ్గడం లో ఈ రెండు జట్లు కూడా ఫుల్ జోష్లో ఉన్నాయి. దీంతో ఇవాళ జరగబోయేటువంటి ఫైనల్స్ మ్యాచ్ లో ఎవరు కప్పు కొట్టినా కూడా రెండవసారి టైటిల్ నెగ్గినట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు మ్యాచ్ చాలా రసవత్రంగా సాగేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఢిల్లీకి ఆశు మాలిక్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా మరోవైపు పూనేరీ పల్టాన్ జట్టుకి ఇనందర్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. కాగా సెమీఫైనల్స్ లో పునేరి పల్టాన్ పై తెలుగు టైటాన్స్ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోచ్ కిషన్ హుడా కూడా కన్నీరు పెట్టిన సన్నివేశం ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ ను బాగోద్వేగానికి గురిచేసింది. మరి ఈరోజు ఆడేటువంటి ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : నేడు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజ్ కు రెండో ప్రమాద హెచ్చరిక!
Read also : ఫర్టిలైజర్ షాప్ లో అర్ధరాత్రి దొంగతనం
 
				 
					
 
						 
						




