
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా నేడు భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటికే వరుస విజయాలతో దూసుకు వచ్చి ఫైనల్ మ్యాచ్లో అడుగుపెట్టింది. మరోవైపు భారత మహిళల జట్టు.. ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టుపై విజయాన్ని అందుకుని నేడు ఫైనల్స్కు దూసుకు వచ్చారు. మరి ఈరోజు జరగబోయేటువంటి ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠతమైన పోరు జరుగనుంది. ఈరోజు జరగబోయేటువంటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇరుజట్లలో ఎవరు గెలిచినా కూడా ఇదే మొదటిసారి ట్రోఫీని ముద్దాడిన వారు అవుతారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ ఇరు జట్లు ఒక్కసారి కూడా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. రెండుసార్లు ఫైనల్ కు చేరుకున్నటువంటి భారత మహిళల జట్టు ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి ఫ్యాన్స్ ను ఫుల్ జోష్ లో నింపేలా చూడడానికి పట్టుదలతో కాచుకుని ఉంది. మరోవైపు సౌతాఫ్రికా జట్టు కూడా ఫైనల్ మ్యాచ్ లో విజయాన్ని సాధించి మేమేం తక్కువ కాదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ స్పోర్ట్స్ మరియు హాట్స్టార్లలో లైవ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే అంచనా అయితే సోషల్ మీడియాలో ఓటింగ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత మహిళలు జుట్టు గెలిచే అవకాశం 68 శాతం ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : కెన్యాలో తీవ్ర విషాదం.. 21 మంది మృతి, 30 మంది గల్లంతు!
Read also : ఈ రోజైనా గెలుస్తారా.. టీమిండియాకు ఏం తక్కువయింది?





