
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- తిరుపతిలో అత్యాధునిక టెక్నాలజీతో బస్ స్టేషన్ నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా బస్టాండ్ నిర్మించాలని, ప్రతి బస్ కు కూడా ఎలక్ట్రిక్ చార్జింగ్ సౌకర్యం ఉండేలా ఈ బస్టాండు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించారు. నిత్యం తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కొన్ని వేల మంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలివస్తూ ఉంటారు. అలాగే ఏదో ఒక పనిమీద తిరుపతి వచ్చే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్టాండ్ లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. కొన్ని లక్షల మంది రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ కొత్త బస్టాండ్ ను నిర్మించాలని చంద్రబాబు నాయుడు అధికారులకు విన్నపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లను కూడా త్వరగా కొత్తగా ఆధునికీకరించాలని ఈరోజు జరిగిన కార్యక్రమంలో అధికారులతో చర్చించారు. తిరుపతిలో కొత్తగా నిర్మించబోయే బస్ స్టేషన్ లో ఒకేసారి 150 బస్సులు నిలిపేలా స్థలం ఉండాలని… లక్షమంది ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేలా నిర్మించాలని కోరారు. కాగా వివిధ పనుల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర జిల్లాల నుంచి ప్రజలు తిరుపతికి రాకపోకలు చేస్తూ ఉంటారు. సాధారణంగా తిరుపతి అంటేనే రద్దీతో కూడిన సిటీ కాబట్టి.. నూతనంగా, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త బస్టాండ్ ను నిర్మించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందుకుగాను అన్ని ఏర్పాట్లను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
Read also : ఈ జిల్లాలకు హెచ్చరిక!.. రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షాలు
Read also : తురకపాలెం లో మరణాలకు యురేనియమే కారణమా?.. అసలు ఏం జరుగుతోంది!